సంక్షోభంలో పూల వ్యాపారం

సంక్షోభంలో పూల వ్యాపారం

హొసూరు : స్థానిక పూల మార్కెట్ వ్యాపారం లేక వెవెలబోతోంది. నిత్యం ఇక్కడ పూల కొనుగోలుదార్లతో రద్దీగా ఉండేది. వాతావరణ అనుకూల పరిస్థితులు, సారవంతమైన భూములు ఉండడంతో హొసూరు ప్రాంతం పూల ఉత్పత్తిలో పేరు పొందింది. వేల ఎకరాల్లో రైతులు పూలను సాగు చేస్తున్నారు. చక్కటి మార్కెట్ సదుపాయం కూడా హొసూరుకు కలిసొచ్చింది. దీని వల్ల పూల సాగు ఈ ప్రాంత రైతులకు లాభాల పంట పండించింది. అయితే గత కొద్ది రోజులుగా పూల వ్యాపారం దారుణంగా పడిపోయింది. వినాయక చవితి తర్వాత పూలను అడిగే వారే కరువయ్యారు. దరిమిలా వేల మంది రైతులు, వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. స్థానిక పూల మార్కెట్లో సోమవారం టన్నుల కొద్దీ పూలు వచ్చాయి. అయితే కొనుగోలుదార్లు లేక మార్కెట్ కళా విహీనంగా దర్శనమిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos