ఉక్కు కార్మికులపై బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుర్మార్గం

ఉక్కు కార్మికులపై బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుర్మార్గం

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల బిజెపి ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వీటిని ఖండిస్తున్నామని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు అన్నారు. విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని, వి ఆర్ ఎస్ తీసుకోవాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పటాన్ని నిరసిస్తూ, బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ ఎం.జగ్గు నాయుడు, ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె అచ్యుతరావు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ మాట్లాడుతూ, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రాచరిక పాలనలో ఉన్నారా, ప్రజాస్వామ్య పాలనలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాచరికం నుంచి ఆయన వెనక్కి రావాలన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలతోనో, సమ్మెలతోనో కేంద్రం ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పడం దుర్మార్గం అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కార్మికుల, ప్రజల పోరాటాల ఫలితం అని వారు చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.1440 కోట్లు ప్యాకేజీ ప్రకటించడం పట్ల స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4900 కోట్లు మాత్రమే ఇచ్చిందని, అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్లాంట్ కోసం చేసిన కష్టంతో వచ్చిన ఆదాయంతో, స్టీల్ ప్లాంట్ వివిధ రకాల పన్నులు, డివిడెంట్లు రూపంలో రూ.54 వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిందని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి ఆదాని కో, మెటల్ కు కొత్త పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. విష్ణు కుమార్ రాజు కేంద్రంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయటం లేదని ప్రధానితో ప్రకటన చేయించాలన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలన్నారు. సెయిల్ లో విలీనం చేయాలన్నారు. ఇది చేయించగలిగితే విష్ణుకుమార్ రాజును, ప్రధాని మోడీని సన్మానిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి.కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, ఎటియుసి నాయకులు ఎస్.ఎ రెహమాన్, పి.చంద్రశేఖర్, సిఎస్ టియు జిల్లా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.-bjp

తాజా సమాచారం

Latest Posts

Featured Videos