మహారాష్ట్ర పంచాయతీల్లో సీపీఐ(ఎం) విజయాలు

మహారాష్ట్ర పంచాయతీల్లో సీపీఐ(ఎం) విజయాలు

ముంబయి : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో తలసరి, దహను తహసీల్‌లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 13 గ్రామాల్లో 8 సర్పంచ్‌లు, 100 గ్రామ పంచాయతీ సభ్యుల స్థానాలను సీపీఐ(ఎం) గెలుచుకుంది. మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 5న జరిగాయి. వాటిలో పాల్ఘర్‌ జిల్లాలోని తలసరి, దహను తహసీల్‌లోని కొన్ని గ్రామాలున్నాయి. వాటికి సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. తలసరి తహసీలులో కవాడ నుంచి దర్శన బోధలే, కరాజ్‌గావ్‌ నుంచి సంగీత ధోడాడే, ఉధ్వ నుంచి నిర్మల్‌ ఫర్లే, కుర్జే నుంచి విజరు భోయే, అప్లాట్‌ నుంచి ప్రవీణ్‌ బమానియా సీపీఐ(ఎం) సర్పంచ్‌లు గెలుపొందారు. దహను తహసీల్‌లోని సోగ్వే నుంచి లహాని దౌదా, మోద్గావ్‌ నుంచి రంజనా చౌదరి, కిన్వాలి నుంచి శేలు దుమాడ సీపీఐ(ఎం) సర్పంచ్‌లుగా గెలుపొందారు. తలసరి తహసీల్‌ గ్రామాల్లో ఉధ్వ (14/17), అప్లాట్‌ (13/17), కుర్జే (11/13), వెవ్జీ (9/17), కవాడ (8/13), కరాజ్‌గావ్‌ (7/11), ఘిమానియా (3/11) గ్రామ పంచాయతీ సభ్యులు సీపీఎం తరపున గెలిచారు. దహను తహసీల్‌ గ్రామాల్లో సోగ్వే (8/9), కిన్వాలి (8/11), అంబేసరి (7/13), మోద్గావ్‌ (6/13), జంబుగావ్‌ (3/13), గంగంగావ్‌ (3/9) గ్రామ పంచాయతీ సభ్యులు సీపీఐ(ఎం) తరపున గెలిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos