మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

హైదరాబాద్: బీజేపీకి మహిళల పట్ల అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండు చేశారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంత బీజేపీ కోసమేనని, బీజేపీ కోసం ఎంఐఎం చాలా రాష్ట్రాల్లో పోటీచేసి ఓట్లు చీల్చిందని విమర్శించారు. బీజేపీకు లబ్ధి చేకూరేలా బీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ఆలోచన ఉందన్నారు. ఇండియా కూటమిని కాదని పరోక్షంగా బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకీ వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos