ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు

ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తాజాగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి, అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos