ఈ నీళ్లు తాగితే రోగాలు మాయం

ఇవియన్‌ వాటర్‌..ఈ పేరు చెప్తే ఎవరికీ టక్కున గుర్తురాకపోవచ్చు. కానీ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ తాగే నీళ్లు అంటే మాత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తాగునీటి బ్రాండ్‌ ఇది. సహజసిద్ధమైన మినరల్‌ వాటర్‌ను అందించడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. స్విట్జర్లాండ్‌- ఫ్రాన్స్‌ మధ్యలో ఉన్న ఇవియన్‌-లెస్‌-బైన్స్‌ అనే ప్రాంతంలో ఉన్న జెనీవా లేక్‌ నుంచి ఈ నీటిని తీస్తారు. పశ్చిమ యూరప్‌లో ఉన్న అత్యంత పెద్ద సరస్సుల్లో ఇది ఒకటి. చాలాకాలం కింద భూమిలో కలిగిన రసాయనిక చర్యల వల్ల ఇక్కడి నేలల్లో ఖనిజలవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. జెనీవా సరస్సు కూడా ఇక్కడే ఉండటం వల్ల ఈ నీటికి సహజ సిద్ధంగానే ఖనిజలవణాలు అందాయి. తొలుత ఈ నీటిని ఔషధాల తయారీకి ఉపయోగించేవారు.అయితే దీని వెనక కూడా ఓ కథ ఉంది. 1789లో మార్కిస్‌ అనే వ్యక్తి ద్వారా ఈ నీటి ప్రాముఖ్యం ప్రపంచానికి తెలిసిందని చెప్తుంటారు. ఆయనకు కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులుండేవి. అయితే ఆయన జెనీవా సరస్సు మార్గం ద్వారా ఉద్యోగానికి వెళ్లేవారు. దారిలో ఆ సరస్సులో నీరు తాగడం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో ఆయన వ్యాధులు నయమయ్యాయి. జెనీవా నీటి వల్లే తనకు వ్యాధులు నయమయ్యాయని ఆయన ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి చెప్పడంతో ఆ సరస్సును ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇవియన్‌ ప్రాంతంలో ఈ సరస్సు ఉంది కాబట్టి ఈ నీళ్లకు కూడా ఇదే పేరు వచ్చింది. తర్వాత ఆ నీటితో ఔషధాలు తయారు చేయడం మొదలు పెట్టింది. దాదాపు 120 ఏళ్లకు పైగా ఈ నీటిని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే ఉపయోగించే వారు. 1908లో ఫ్రాన్స్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈనీటిని సీసాల్లో ఉంచి విక్రయించడం ప్రారంభించింది. ఇక టెక్నాలజీతో పాటు వీటిఇవియన్‌ బ్రాండ్‌ నీళ్ల ధర కూడా అధికంగానే ఉంటుంది. ఎందుకంటే 330మి.లీ నీటి సీసా విలువ దాదాపు రూ.800. లీటరు నీళ్ల సీసా ధర రూ.1,440. దీనికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. దీంతో పాటు డిమాండు కూడా అదే స్థాయిలో ఉంది. సరస్సు నుంచి నీటిని తీసి ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడిన పని. అంతేకాకుండా ఈ నీటిని నిల్వ చేయడానికి అత్యంత నాణ్యమైన పాలీఇథలీన్ టెరిఫ్తలేట్‌ సీసాలను ఉపయోగిస్తారు. ఈ సీసాలను తయారు చేయాలంటే ఎన్నో ముందస్తు పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఈ కారణంగానే ఇవియన్‌ నీళ్లు అంతవిలువైనవి. హాలీవుడ్‌ ప్రముఖులు: హాలీవుడ్‌ ప్రముఖుల్లో చాలామంది ఇవియన్‌ నీళ్లనే తాగుతారు.ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ డేవిడ్‌ లాచాపెల్‌, అమెరికా మోడళ్లు, నటులు వీటినే తాగుతారు. భారత్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మాత్రమే ఈ నీటిని తాగుతాడు.
ఇవియన్‌లో పోషకాల విలువ ఇలా: లీటర్‌ ఇవియన్‌ నీళ్లలో 8మి.గ్రా కాల్షియం, 6.8మి.గ్రా క్లోరైడ్‌, 26మి.గ్రా మెగ్నీషియం, పొటాషియం 1మి.గ్రా, సోడియం 6.5మి.గ్రా ఉంటాయి. విక్రయాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ నీటికి మరింత డిమాండ్‌ వస్తుండటంతో 1969లో ప్లాస్టిక్‌ సీసాల్లో విక్రయించడం ప్రారంభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos