అవినీతి ఆరోపణలతో ఆరోగ్య మంత్రి పై వేటు

అవినీతి ఆరోపణలతో ఆరోగ్య మంత్రి పై  వేటు

ఛండీగఢ్ : అవినీతి ఆరోపణలపై ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా ను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళ వారం పదవి నుంచి తొలగించారు. వివిధ కాంట్రాక్టులపై అధికా రుల నుంచి 1 శాతం కమిషన్ను వసూలు చేసేవారని మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. సింగ్లాపై వచ్చిన ఫిర్యాదులతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు మాన్ విలేఖరులకు చెప్పారు. ‘ఒక్క శాతం అవినీతిని కూడా తాము సహించేది లేదు. ప్రజలు ఎన్నో అంచనాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఆ అంచనాలను నిలబెట్టు కోవడం మా బాధ్యత. 2015లోనూ అవినీతి ఆరోపణలు వచ్చిన ఒక మంత్రిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ పదవి నుంచి తొలగించారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేజ్రీవాల్ మా వద్ద వాగ్దానం తీసుకున్నారు. మేమంతా ఆయన సైనికులమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos