కరోనా కొత్త కేసుల్లో ఆ దేశాలను దాటేసిన ఆంధ్రప్రదేశ్..

కరోనా కొత్త కేసుల్లో ఆ దేశాలను దాటేసిన ఆంధ్రప్రదేశ్..

కొద్ది రోజుల క్రితం కరోనా కేసుల్లో,మరణాల్లో ఎక్కడో వెనుక ఉంటూ కరోనా నియంత్రణలో మెరుగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో మొదటి స్థానం దిశగా దూసుకుకెళుతోంది.ప్రతిరోజూ పది వేల కేసులు,పదుల సంఖ్యల్లో మరణాలు నమోదువుతున్నాయి.దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే.. ఏపీ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర నిలుస్తోంది. ఇప్పుడా రాష్ట్రంలో రోజుకు 12వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులిటెన్ ప్రకారం ఒక్కరోజులో 12822 కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న ఏపీలో 10820 కేసులు నమోదయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్రను ఏపీ దాటేస్తుందా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. మహారాష్ట్ర.. ఏపీ తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా తమిళనాడు.. కర్ణాటకలు ఉన్నాయి.ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఆ మధ్య వరకు కేసుల నమోదును పెద్ద ఎత్తున కంట్రోల్ చేసినట్లుగా ప్రశంసలు అందుకున్న కేరళలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.జర్మనీ.. ఇటలీ.. పాకిస్థాన్.. బ్రిటన్.. సౌదీ.. ఇరాన్.. ఆదివారం ఒక్కరోజులో నమోదైన కేసుల కంటే కూడా ఒక్క ఏపీలో నమోదైన కేసులు ఎక్కువ కావటం గమానర్హం. ఈ దేశాల్లో ఆదివారం ఒక్కరోజులో నమోదైన కేసులు 6082. కానీ.. ఏపీ ఒక్క రాష్ట్రంలో నమోదైన కేసులు అక్షరాల 10820. అంటే.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక్కరోజు నమోదైన కేసుల్ని కలిపినా కూడా ఏపీ కంటే తక్కువగా ఉండటం చూస్తే.. ఏపీలో కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుంది.ఇక మరణాల విషయంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే.. తమిళనాడు రెండోస్థానంలో ఉంది. ఈ విషయంలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. తెలంగాణలో అతి తక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జగన్ సర్కారు కరోనాను సమర్థవంతంగా నియంత్రణ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos