మడ అడవుల్లో పయనం జీవితకాల మధుర అనుభవం..

  • In Tourism
  • September 13, 2019
  • 573 Views
మడ అడవుల్లో పయనం జీవితకాల మధుర అనుభవం..

జీవ వైవిధ్యానికి,పచ్చదనానికి ఆవాసాలైన దేశంలోని అతిపెద్ద అడవుల్లో ఒకటైన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న కోరంగి అడవులు జీవిత కాలం మధుర అనుభవాలు పంచుతాయి.అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి. రంగురంగుల పడవలు, చిత్తడినేలలు, సముద్రపు గాలీ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాలువ గట్లు, పంట పొలాలు, పచ్చిటి చెట్లతో నిండిన ఆ రోడ్డులోంచి అభయారణ్యాలకు పయనం అవ్వడం ఒక మధురానుభూతి.మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా ఉందని, ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయి. కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో కోరంగి మడ అడవులు విస్తరించి ఉన్నాయి.సుముద్రతీరపు చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవుల అందాలను అడవి లోపలికి వెళ్లి చూడటం చాలా కష్టం.అయితే కోరింగలో అటవి మధ్యలో ఏర్పాటు చేసిన చెక్క వంతెన ద్వారా అడవి లోపలికి ప్రవేశించి ఇక్కడ ఉన్న వాచ్ టవర్ పైనుండి అడవి అందాలను వీక్షించవచ్చు. బ్యాక్ వాటర్స్ లో సముద్రం కలిసే చోటు వరకూ బోటు షికార్ చెయ్యవచ్చు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన పురాతన లైట్ హౌస్ మరింత అనుభూతిని కలిగిస్తుంది.జీవవైవిధ్యానికి పేరైన కోరండి మడ అడవుల్లో పెరిగే పలు రకాల జాతుల చెట్లు వేర్ల ద్వారా ఆక్సిజన్ పీల్చుకొని పెరుగుతాయి.నల్లమడ, తెల్ల మడ, విల్వమడ, ఊరుడు, కలింగ, ఉప్పుపొన్న, గుగ్గిలం, గంగరావి వంటి ఎన్నో రకాలా చెట్లు మడ అడవుల్లో పెరుగుతాయి.భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ ‘చిత్తడి అడవులు ‘ కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరరుగుతాయి.ఈ అడవుల్లో మాత్రమే కనిపించే చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు.జనవరి నుంచి మార్చి నెలల వరకు సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు.దర్శించటానికి నవంబరు, డిసంబరు నెలలు అత్యుత్తమమైనవి.నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులు సంతానోత్పత్తికి కోరంగి అడవులకు వస్తుంటాయి. మడ ఆడవులలో దీపస్తంభం వెళ్ళలేని వారు పడవరేవు దగ్గర ఉన్న నాలుగు అంతస్తుల ఎత్తైన గోపురం (Watch Tower)పై నుంచి మొత్తం వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోరింగి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించడం వల్ల మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక్కడ బోట్ రైడింగ్ కు చాలా ప్రత్యేకత ఉంది. కోరింగ అభయారణ్యాల అందమంతా ఈ ప్రదేశంలోనే ఉంటుంది. బోట్ రైడింగ్ ద్వారా గోదావరి నది సముద్రంలో సంగమించే ప్రదేశానికి అత్యంత చేరువగా తీసుకెళ్తారు. అలాగే పర్యాటకానికి నిషిద్దమైన రెండో కోరింగ దీవి వైపు కూడా తీసుకుని వెలుతారు.చెక్కబాట (Boardwalk), కోరంగి తాళ్ళ వంతెన (Corangi Rope Bridge).చెక్క వంతెనల మీదుగా నీటితో నిండి ఉన్న మన్యంలో ప్రయాణించడం మనసుకు చాలా హాయినిస్తుంది..
చేరుకోవడం ఎలా..
రోడ్డు,రైలు మార్గం ద్వారా కాకినాడు లేదా రాజమండ్రికి చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో కోరంగి అడవులకు చేరుకోవచ్చు. కాకినాడ పట్టణం నుండి కోరింగ అభయారణ్యాలకు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ టాక్సీలు ఉంటాయి. బస్సులు అయితే కోరంగి అభయారణ్య జంక్షన్ దగ్గరే ఆగిపోతాయి.తిరుగు ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కావున, అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే కోరంగి బస్స్టాండ్ కు నడవాలి.

మడ అడవుల్లో చెక్క వంతెన


చెట్ల మధ్యలో చెక్క వంతెన


మడ అడవులు


గోదావరికి ఇరు వైపులా మడ అడవుల అందాలు


గోదావరికి ఇరు వైపులా మడ అడవుల అందాలు


గోదావరికి ఇరు వైపులా మడ అడవుల అందాలు


ఉప్పునీటి మొసలి..


చేపల కోసం పక్షుల వేట..


వసల పక్షుల కేరింత..


సంతానోత్పత్తికి వచ్చిన వలస పక్షి


సంతానోత్పత్తికి వచ్చిన వలస పక్షి


వన మూలికల సంరక్షణ ప్రదేశం..


సంధ్యా సమయాన సముద్ర తీరం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos