నేపాల్ వివాదాస్పద ముసాయిదాకు ఆమోదం

నేపాల్ వివాదాస్పద ముసాయిదాకు ఆమోదం

న్యూ ఢిల్లీ : లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముసాయిదాను గురువారం ఆ దేశ పార్లమెంట్ ఎగువసభ ఏక గ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ ముసాయిదాను రెండు రోజుల కిందటే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించింది. ఉత్తరాఖండ్లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. ఎగువ సభలో ముసాయిదాను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. గత మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos