ప్రియాంక చోప్రా కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరిందబ్బా!

ప్రియాంక చోప్రా కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరిందబ్బా!

న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఓ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత వేదికపై చేసిన వ్యాఖ్యలు నెట్టంట్లో నవ్వులు పూయిస్తున్నాయి.సురేంద్ర కుమార్‌ అనే కాంగ్రెస్‌ నేత నిర్వహించిన సమావేశానికి పార్టీ సీనియర్‌ నేత  సుభాష్ చోప్రా పాల్గొన్నారు.మొదట ర్యాలీ నిర్వహించిన అనంతరం సభను ఏర్పాటు చేశారు.అందులో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన అనంతరం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పేరు పలికారు.దీంతో కార్యకర్తలు జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.ఆపై కాంగ్రెస్ పార్టీఅనగానే మరోసారి జిందాబాద్ కొట్టారు. రాహుల్ గాంధీఅనగానే అదే స్పందన.ఇక తరువాత ప్రియాంకా గాంధీఅనాల్సిన సురేంద్ర పొరపాటున ప్రియాంకా చోప్రా అనేశారు. కార్యకర్తలు జిందాబాద్ చెప్పేశారు. దీంతో అవాక్కైన కార్యక్రమ నిర్వాహకులు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ముందురోజు రాత్రి ప్రియాంకా చోప్రా సినిమాను సురేంద్ర చూసివుంటారని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ లో ఎప్పుడు చేరారని ప్రశ్నిస్తున్నారు.

తాజా సమాచారం