వ్యవసాయ చట్టాల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

వ్యవసాయ చట్టాల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

న్యూ ఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలు అమలుకాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటి అమలు నిలుపు దల చట్టాల్ని చేసేందుకు ఆయా రాష్ట్రాల శాసనసభలు ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించనున్నాయి. కేంద్రం చేసిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను అడ్డుకునే అవకాశాలను పరిశీలించాలని తమ పార్టీ పాలనలోని రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలోనే పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా ముసాయిదాను పార్టీ రూపొందించింది.దీని పేరు-రైతుల హక్కు, ప్రత్యేక భద్రతా నిబంధన ముసాయిదా-2020. ప్రస్తుత నియమావళి ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల అంశం. మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే తక్కువకు రైతుల నుంచి వ్యాపారులు పంట కొనుగోలు చేయకుండా నిరోధించే నిబంధనా ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఖేతీ బచావో యాత్రను ప్రారంభించారు. పంజాబ్లో మొదలైన ఈ యాత్ర హరియాణా నుంచి దిల్లీ వరకు సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos