ఖ‌ర్గేకు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాయ‌మైన‌ట్టేనా?

ఖ‌ర్గేకు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాయ‌మైన‌ట్టేనా?

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి గాంధీ కుటుంబ విధేయుడు, సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేనే వరించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి నామ పత్రాన్ని దాఖలు చేసిన మరునాడు-శనివారం రాజ్యసభలో విపక్ష నాయత్వ పదవికి రాజీనామా చేయటం ఇందుకు బలం చేకూరుస్తోంది. పార్టీలో ఒకే వ్యక్తికి ఒకే పదవి ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఉదయ్పూర్ తీర్మానాన్ని అనుసరించి, ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఖర్గే వారసుల య్యేందుకు పి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్ రేసులో పోటీ పడుతున్నారు. ఖర్గే అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇస్తామని జి-23 నేతలు పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపిందర్ హుడా ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos