బాగలేదనడానికి ఈ గొట్టంగాళ్లు ఎవరు?

  • In Film
  • October 22, 2019
  • 47 Views
బాగలేదనడానికి ఈ గొట్టంగాళ్లు ఎవరు?

తెలుగు ప్రముఖ హాస్య నటుడు అలీ సినీ విమర్శకులపై తీవ్రస్థాయిలో అసహనం వెళ్లగక్కాడు.అలీ పూర్తిస్థాయిలో నటించిన రాజగాది గది 3 చిత్రంపై సమీక్షలు నెగిటివ్గా రాయడంతో అలీ సినీ విమర్శకులపై ఓ రేంజులో మండిపడ్డాడు. నేరుగా క్రిటిక్స్ మాట ఎత్తకుండానే“కొందరు మాత్రం మా సినిమాలో లోపాల్ని వెతకడమే పనిగా పెట్టుకున్నారు. సినిమా బాగోలేదని రకరకాల కామెంట్లు చేశారు. మా సినిమాని అనడానికి ఈ కోన్ కిస్కా గొట్టం గాళ్లు ఎవరు?“ అంటూ ప్రశ్నించాడు. వాళ్లంతా బోకులు అని ప్రివ్యూ షోల్లో ఎవరూ సరిగా నవ్వరు. ఫీలింగ్స్ దాచేసుకుంటారు అంటూ క్రిటిక్స్ పై సెటైర్ వేశారు. అయినా ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తాం. వీళ్ల కోసం కాదు.. అని అన్నారు.”సినిమా ఎలా ఉందో చెప్పాల్సింది ప్రేక్షక దేవుళ్లు.. వాళ్లను నమ్ముకొని మేం బ్రతుకుతున్నాం.. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో..వాళ్లని నమ్ముకొని మేం ఇండస్ట్రీలోకి రాలేదు. అలా సినిమా మీద ఒక రాయి వేసేస్తే.. మేం తోపులం అనుకుంటారు.. కానీ మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరని నేను అనుకుంటున్నా..”అంటూ క్రిటిక్స్ పై ధ్వజమెత్తారు.

తాజా సమాచారం