101 దేశాల నాణేల ప్రదర్శన

హొసూరు : ఇక్కడికి సమీపంలోని సమత్తువపురం ప్రభుత్వ పాఠశాలలో నూట ఒక్క దేశాలకు చెందిన పాత, కొత్త నాణేల ప్రదర్శన నిర్వహించారు.  ప్రదర్శనను హొసూరు ఎమ్మెల్యే సత్య పాల్గొని ప్రారంభించారు. అమెరికా, జపాన్, జర్మనీ కెనడా, ఇథియోపియా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన పాత నాణేలు, కరెన్సీ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి.  పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులు నాణేలను తిలకించి ఆనందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులపై అవగాహన పెరుగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజా సమాచారం