కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు మంత్రి పదవులు

కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు మంత్రి పదవులు

పాట్నా: నితీష్ కుమార్ సారథ్యంలోని మహా గఠ్బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మంత్రి పదవులు దక్కనున్నాయి. సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రమాణం చేసారు. నాలుగు మంత్రి పదవులు, సభాపతి పదవిని కాంగ్రెస్ పార్టీ ఆశించింది. స్పీకర్ పదవిని ఇచ్చేందుకు నితీష్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో ఆర్జేడీకి సభ సభాపతి పదవి దక్కనుంది. మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎంకు ఒక మంత్రి పదవి దక్కనుంది. జేడీయూ దాదాపు గత మంత్రి వర్గంలో ఉన్న మంత్రులనే కొనసాగించే అవకాశాలున్నాయి. నితీష్ వద్దే హోం శాఖ ఉండనుంది. గత ప్రభుత్వంలో బీజేపీ నిర్వహించిన మంత్రి పదవులు ఆర్జేడీకి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos