ఆందోళన దేశ ద్రోహం కాదు

ఆందోళన దేశ ద్రోహం కాదు

న్యూ ఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల గురించి ఇక్కడి ఉన్నత న్యాయస్థానం మంగళ వారం కీలక వ్యాఖ్య చేసింది. ఆ కేసులో ఏడాది కిందట అరెస్టయిన ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మహిళా హక్కుల సంఘం పింజ్రా టాడ్ సభ్యులైన నటాషా నర్వాల్, దేవాంగన కలీతాలతో పాటు జామియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద అరెస్టయిన వారికి కింది కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా వారికి రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను ఇచ్చింది. పాస్ పోర్టులను అధికారులకు సరెండర్ చేయాలని, విచా రణకు అడ్డంకులు సృష్టించకూడదని వారిని ఆదేశించింది. ‘అసమ్మతిని అణచి వేయాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం ప్రసాదించిన నిరసన హక్కుకు, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నని గీతను ప్రభుత్వం చెరిపేసినట్టుంది. భవిష్యత్ లో ఇదే కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి దుర్దినం అవుతుంది’’ అని వ్యాఖ్యా నించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos