రక్తంతో ప్రేమలేఖ రాశాడు..

  • In Film
  • February 25, 2020
  • 159 Views
రక్తంతో ప్రేమలేఖ రాశాడు..

ఆనందంసినిమాతో  తెలుగు తెరకి రేఖ పరిచయమైంది. విశాలమైన కళ్లతో ఆమె పలికించిన హావభావాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఐదు భాషల్లో ఆమె 40 సినిమాల వరకూ చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ” కన్నడలో నేనుచిత్రసినిమా చేశాను. హీరోయిన్ గా నాకు అది మొదటి సినిమా. అందులో నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను.సినిమాలో నేను కనిపించగానే కొంతమంది అభిమానులు చిల్లర డబ్బులు తెరపైకి చల్లేవారట. విషయం తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. సినిమా తరువాత నా క్రేజ్ పెరిగిపోయింది. అభిమానుల నుంచి లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేవి. ఒక అభిమాని అయితే రక్తంతో లవ్ లెటర్ రాశాడు. నిజం చెప్పాలంటే లవ్ లెటర్ చూసి నేను చాలా భయపడిపోయాను. సినిమా సక్సెస్ .. దానితో వచ్చిన గుర్తింపును నేను ఎప్పటికీ మరిచిపోలేను. నా తొలి సినిమానేకాదు, తరువాత వచ్చిన రెండు సినిమాలు కూడా 175 రోజులు ఆడటం విశేషంఅని చెప్పుకొచ్చింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos