ఎల్జిపీ నేత గుర్తింపుపై చిరాగ్ ఆక్షేపణ

ఎల్జిపీ నేత గుర్తింపుపై  చిరాగ్ ఆక్షేపణ

న్యూఢిల్లీ :లోక్సభలో లోక్జనశక్తి పార్టీ (ఎల్జెపి) సభాపక్షనేతగా తన చిన్నాన్న పశుపతి కుమార్ పారిస్ను గుర్తించడాన్ని వ్యతిరేకించి చిరాగ్పాశ్వాన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇది తమ పార్టీ నిబంధనలకు వ్యతిరేకమ న్నారు. అసలు తమ పార్టీ నుంచి ఎవరు సభాపక్షనేతగా ఉండాలనేది.. రాజ్యాంగంలోని 26వ అధికరణం ప్రకారం సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి అయిదుగురు ఎంపీలను బహిష్కరించినట్టు తెలిపారు. ఈ కుట్రలకు ముఖ్యమంత్రి నితీష్కుమార్ కారణమని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ బతికి ఉన్నప్పుడే జరిగాయని అన్నారు. ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాడతానని అన్నారు. ఇదంతా తన ఆరోగ్యం బాగులేని సమయంలోనే జరిగిందని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos