భాజపా పై చిరాగ్ చిర్రుబుర్రు

భాజపా పై చిరాగ్ చిర్రుబుర్రు

పాట్నా : బిహార్ రాజకీయం శనివారం హటాత్తుగా మలుపు తిరిగింది. ఇప్పటి వరకూ ఎన్డీయేపై మహాఘట్ బంధన్ విరుచుకు పడుతోంది. ఇప్పుడు బంధన్కు ఎల్జేపీ కూడా తోడైంది. ప్రధాని మోదీ, భాజపా పట్ల మెతక వైఖరి కలిగిన చిరాగ్ పాశ్వాన్ భాజపాపై ధ్వజమెత్తారు. ‘ఎల్జేపీతో పొత్తు పెట్టుకోవడం లేదు. అది ఓట్ల్లు చీల్చే పార్టీ’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది చిరాగ్ పాశ్వాన్కు చిర్రెత్తించింది. భాజపాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము ఓటును చీల్చేవారిమైతే 2014 లో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నితీశ్ ఒత్తిడితోనే భాజపా ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. భాజపా తన సొంత వివేకంతో వ్యాఖ్యానించాలని చురకలంటించారు. ‘మా తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ను నరేంద్ర మోదీ చాలా గౌరవించారు. నేను మోదీతోనే ఉంటాను. ఆయనను చాలా గౌరవిస్తాను. ఎన్నికలు హోలీ పండగ లాంటిది. అందులో చాలా రంగులు దర్శనమిస్తాయి. హోలీ తర్వాత ప్రజలు స్నానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. 143 స్థానాల్లో పోటీ చేస్తాం. జేడీయూకు వ్యతిరేకంగా కూడా అభ్యర్థిని దించుతాం. కొందరు నితీశ్ ఒత్తిడితో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేది ఎల్జేపీ, బీజేపీ ప్రభుత్వమేన’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos