బంగ్లాదేశ్‌లో హిందూ ఇంటిపై ముస్లిం గుంపు దాడి

బంగ్లాదేశ్‌లో హిందూ ఇంటిపై ముస్లిం గుంపు దాడి

డాకా : బాగెర్హాట్ సబ్ జిల్లా చితల్మడీ ప్రాంతంలోని చింగారి గ్రామంలో దీపక్ సర్కార్ నివాసాన్ని ముస్లిం సమూహం ధ్వంసం చేసింది. ఢాకా ట్రిబ్యూన్ పత్రిక ప్రకారం. మొహ మ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక టీ కొట్టు దగ్గర వారం రోజుల కిందట దీపక్ సర్కార్కు కొందరు స్థానిక ముస్లింలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ముస్లిం సమూహం ఆయన ఇంటిపై దాడికి చేసింది. ఇంటి లోని వారు తప్పించుకోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదని పోలీసులు వెల్లడించారు. దీపక్ సర్కార్ను అదుపులోకి తీసుకోవటంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని పోలీసులు వివరిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos