సాక్ష్యాధారాలు లేకుండా ఆర్యన్ ఖాన్‌ను బంధించారు

సాక్ష్యాధారాలు లేకుండా ఆర్యన్ ఖాన్‌ను బంధించారు

న్యూఢిల్లీ : సాక్ష్యాధారాలు లేకుండా నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసి, 25 రోజులపాటు ఏ విధంగా జైలులో పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత పి చిదంబరం శని వారం ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్ గత ఏడాది క్రూయిజ్ నౌకపై మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు ఆరోపణ. శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తను నిర్దోషిగా ప్రకటించింది. ఇంకా ఆయనతోపాటు మరో ఐదుగురు నిందితులకు వ్యతిరేకంగా కూడా సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. ‘షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్పై ఆరోపణలను దర్యాప్తు సంస్థ ఉపసంహరించు కుంది. దీనికి కారణం ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడమే. ఎటువంటి సాక్ష్యం లేకుండా ఆయనను 25 రోజులపాటు ఏ విధంగా జైలులో ఉంచార’ని చిదంబరం ట్వీట్లో ప్రశ్నించారు. ‘ఆర్యన్ ఖాన్ అనుభవించిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు? చాలా కేసుల్లో ముందుగా అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్నారు. ఇది చట్టం ద్వారా ఏర్పాటైన విధానాన్ని పక్కదారి పట్టించడమేన’ని కూడా విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos