చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు:వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇక్కడి విమానాశ్రయంలో  ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos