విద్యుత్‌ చేతక్ వచ్చింది

విద్యుత్‌ చేతక్ వచ్చింది

బెంగళూరు: బజాజ్ చేతక్ విద్యుత్ ద్విచక్ర వాహనం మంగళవారం ఇక్కడ దేశీయ విపణిలోకి విడుదలైంది. అర్బన్, ప్రీమియం అనే రెండు రకాల్లో లభిస్తుంది. ఒక్కో అర్బన్ ధర రూ.లక్ష. ప్రీమియం ధర రూ.1.15లక్షలు. బుధవారం నుంచి బుకింగ్స్ ఆరంభమవుతాయి. ప్రస్తుతానికి పుణె, బెంగళూరులో మాత్రమే దీన్ని విడుదల చేశారు. ఒక్కసారి బ్యాటరీని ఛార్జ్ చేస్తే ఎకో మోడ్లో దాదాపు 95 కి.మీలు, స్పోర్ట్స్ మోడ్లో 85 కి.మీలు ప్రయాణించ వచ్చు. రీఛార్జి వ్యవధి ఐదు గంటలు. భారత్లో ప్లాస్టిక్ కు బదులు లోహపు కవచంతో తయారైన తొలి ద్వి చక్రవాహనం ఇదే. మహారాష్ట్రలోని చకన్ కర్మాగారంలో వీటి ఉత్పత్తి చేస్తున్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos