ముళ్ల పంది దెబ్బకు చిరుత పరార్

చిరుత పులి అంటే మనుషులే హడలిపోతారు. ఇక జంతువుల సంగతి సరేసరి. అయితే ఓ ముళ్ల పంది దెబ్బకు చిరుత తోక ముడవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ వీడియోను ఇప్పటికే అనేక మంది వీక్షించారు. చిరుత పులి ముళ్ల పందిపై దాడికి యత్నించింది. అది కూడా తన ముళ్లతో చిరుతపై దాడి చేసింది. పంది ముళ్లు చిరుత ముఖానికి గుచ్చుకోవడంతో నొప్పితో విలవిల్లాడింది. గుచ్చుకున్న ముళ్లను  తీసుకోవడానికి నానా కష్టాలు పడింది. ఎలాగోలా ఆ ముళ్లను తన ముఖం నుంచి విడిపించుకుంది. ఏమనుకుందో ఏమో మరి మళ్లీ ముళ్ల పంది జోలికి పోకుండా తన దారిన నడుచుకుంటూ గడ్డి పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ తతంగాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ విభాగానికి చెందిన అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos