చెక్‌డ్యాం ఎత్తు పెంచాలి

హొసూరు : కృష్ణగిరి జిల్లా అంచెట్టి అక్కా చెల్లి చెరువు కాలువపై నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు చాలక నీరు వృథాగా పోతున్నదని గ్రామస్థులు వాపోతున్నారు. చెక్ డ్యాం నీటితో సమీపంలోని రైతులు వ్యవసాయం చేస్తున్నారు. చెక్ డ్యాం ఎత్తు చాలక పోవడంతో ఏటా వర్షా కాలంలో వరద నీరు ఎక్కువ శాతం వృథాగా పోతున్నందున గ్రామస్థులు డ్యాం ఎత్తు పెంచాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై అధికారులు స్పందించలేదు. గత కొద్ది రోజులుగా అంచెట్టి ప్రాంతంలో వర్షాలు బాగా కురుస్తున్నందున చెక్ డ్యాం నిండిపోయింది. ప్రస్తుతం ఎక్కువ శాతం వరద నీరు వృథాగా పోతున్నది. దీనిని అరికట్టడానికి అంచెట్టి గ్రామస్థులు ఇసుక బస్తాలను చెక్ డ్యాంపై పేర్చి అడ్డు కట్టగా వేశారు. చెక్ డ్యాం ఎత్తు పెంచితే తమకు ఈ అవస్థలు తప్పడమే కాకుండా నీటి వృథాను అరికట్టవచ్చని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెక్ డ్యాం ఎత్తు పెంచడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం