కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

చండీగఢ్ : భారత సరిహద్దు దళాల (బీఎస్ఎఫ్) అధికార పరిధిని పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిమీకి అనుమతించినందుకు ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆగ్రహిం చారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిమీ వరకూ కి బీఎస్ఎఫ్కు అధికార పరిధిని పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పంజాబీలను అసంతృప్తికి గురి చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా కేంద్రం ఏక పక్షంగా వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos