పాకిస్తాన్‌లో పూజలందుకుంటున్న ఏకైక చాముండ మాత

పాకిస్తాన్‌లో పూజలందుకుంటున్న ఏకైక చాముండ మాత

కరాచి: పాకిస్తాన్లోని ఏకైక చాముండ మాత దేవాలయం థార్పార్కర్ కొండ పై ఉంది. అక్కడి హిందువులు చాముండ మాత అని పిలుస్తారు.నాంగర్పార్కర్ పర్వతాలపై ఉన్న ఈ దేవాలయం భారత్-పాకిస్తాన్ సరిహద్దుకి కేవలం రెండు కి.మీల దూరంలో ఉంది. ”చండ, ముండర్ అనే ఇద్దరు రాక్షసులుండేవారు. ప్రజలను కష్టాల పాలు చేస్తున్న చెండముండాసురులను అంతం చేసినందువల్ల ఆ దేవికి చాముండ అనే పేరు వచ్చింద’ని అక్కడి పురాణం. ఏడాదిలో రెండుసార్లు మహా నవరాత్రి సమయంలో ఈ దేవికి పూజలు చేస్తారు. చాముండ మాత రోగాలను పారదోలుతుందని స్థానికుల నమ్మకం. ఎర్రని గ్రానైట్ పర్వతాలపై నిర్మించిన ఈ దేవాలయం వందల ఏళ్ళనాటి పురాత న మైంది. రోడ్డు నిర్మాణంతో ఇప్పుడు భక్తులు సులభంగా ఇక్కడికి చేరుకుంటున్నారు.”ఈ దేవాలయాన్ని కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించారు. గత 10-12 ఏళ్ళుగా ఇక్కడకు భక్తుల రాక పెరిగింది. స్థానిక ప్రభుత్వ చొరవతో రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఇప్పుడు వాహనాల్లో సులభంగా చేరుకునే వీలు కలిగింది. ఇప్పుడు నంగర్ పార్కర్ను కలిపే రోడ్డు బాగుంది. అందువల్ల వర్షాకాలంలో సైతం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ కోరిన కోర్కెలు తీరిన హిందువులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు, యాత్రలకు వస్తుంటారు. కొంతమంది సరదాగా సందర్శన కోసం కూడా వస్తుంటారు” అని స్థానిక భక్తులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos