కేంద్రం పులు గడిగిన ముత్యం

కేంద్రం పులు గడిగిన ముత్యం

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దాఖలైన సమీక్ష వ్యాజ్యాలన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం గురువారం కొట్టి వేసింది. దీంతో కేంద్రం పులు గడిగిన ముత్యమని యోగ్యతా పత్రాన్ని ఇచ్చినట్లయ్యింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను దాచి ఉంచి అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్సిన్హా దాఖలు చేసిన సమీక్ష వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. విమానాల కొనుగోలుకు న్యాయ స్థానం పర్యవేక్షణ అవసరం లేదని తేల్చి చెప్పింది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు రాఫెల్ ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేయలేదని 2018 డిసెంబర్ 14న ప్రకటించింది. అంతకు ముందు దీన్ని మే 10న ధర్మాసనం వాయిదా వేసింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos