సీబీఐ’కి అనుమతి ఉపసంహరించిన ఠాక్రే సర్కార్​

సీబీఐ’కి అనుమతి ఉపసంహరించిన ఠాక్రే సర్కార్​

ముంబై: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే సిబిఐకి విచారణకు వెసులుబాటు కల్పించే ఉత్తర్వు (1989)ను ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో మహారాష్ట్రలో సీబీఐ విచారణకు టే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. టీఆర్పీ రేటింగ్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్లు వస్తున్న దశలో ఈ నిర్ణయం ప్రాధాన్యతన సంతరించుకుంది. న్యూ ఢిల్లీ ప్రత్యేక పోలీస్ చట్టం కింద ఏర్పడిన సీబీఐ అధికార పరిధి కేవలం దేశ రాజధానికి మాత్రమే పరిమితం. ఈ చట్టంలోని సెక్షన్-6 ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి మేరకే సీబీఐ ఆయా ప్రదేశాల్లో సోదాలు చేపట్టాల్సి ఉంటుంది. సీబీఐకి సాధారణ సమ్మతి ఉపసంహరించినా కేసుల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాజస్థాన్, బంగాల్ సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకు న్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos