బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు

బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు

లఖిసరాయ్: జిల్లాలోని బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. బ్యాంకు ఖాతా తనిఖీ చేసుకున్నపుడు ఇది తెలిసింది. సుమన్ కుమార్కు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమాట్ ఖాతా ఉంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు. వారం రోజుల కిందట అతడి బ్యాంకు ఖాతాలోకి రూ.6,8 33.42 కోట్లు జమయ్యాయి. అంత మొత్తం జమకావటంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు డబ్బులు ఎలా వచ్చాయో తెలియడం లేదు. ఇప్పటికీ డబ్బులు ఖాతాలోనే ఉన్నాయి. దీని గురించి తెలుసుకునేందుకు చాలా మందిని సంప్రదించాడు. తొలుత సాంకేతిక తప్పిదం అని భావించాం. కానీ, కస్టమర్ కేర్కు కాల్ చేస్తే.. నిజంగానే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్పష్టమైంది. సమాచార హక్కు కింద వివరాలు కోరాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.”అని సుమన్ కుటుంబ సభ్యుడు శ్రావణ్ కుమార్ చెప్పారు. దీనిపై తమకు పూర్తి సమాచారం అందలేదని సూర్యగఢ పోలీసు అధికారి చందన్ కుమార్ వెల్లడించారు. ‘పట్నా నుంచి మాకు ఒకరు కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పారు. కానీ, అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం అందలేదు. బ్యాంకు అధికారులు దీని గురించి సంప్రదిస్తే ఏమైనా చెప్పగలం’ అని వివరించారు. దీంతో ప్రస్తుతం వేల కోట్ల రూపాయలు ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్నా దీనిపై ఇంతవరకు ఎవరూ పోలీసులను సంప్రదించకపోవడం ఆశ్చర్యం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos