రాబోయే మూడు నెలలు ప్రమాదకరం

న్యూ ఢిల్లీ : కరోనా డెల్టా వేరియంట్ అక్టోబరు- నవంబరు మధ్యకాలంలో వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేసారు. సెకెండ్ వేవ్ నుంచి కాస్త ఉపశమనం లభించినప్పటికీ, థర్డ్ వేవ్ను దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కరోనా నియమావళిని పాటించాలన్నారు. రాబోయే మూడు నెలల్లో పండుగలు, ఉత్సవాలు ఉన్నందున జనం ఒక చోట చేరే అవకాశాలున్నాయి. ఫలితంగా భౌతిక దూరం కరువై వైరస్ వ్యాపించేందుకు అవకాశాలున్నాయని మదింపు. అందుకే ప్రజలంతా తమతమ ఇళ్లలోనే ఉత్సవాలు చేసుకోవాలన్నారు. ముమ్మర టీకాల ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos