ఏటా 4 శాతం వడ్డీ.. ఉచితంగా డెబిట్ కార్డు

ఏటా 4 శాతం వడ్డీ.. ఉచితంగా డెబిట్ కార్డు

హైదరాబాదు: కెనరా బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా జీవన్ ధారా పథకాన్ని ప్రారంభించింది. ఈ ఖాతాను జీరో బ్యాలెన్స్ తో ఓపెన్ చేసుకోవచ్చు. ఏటా 4 శాతం వడ్డీ, కెనరా బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉన్న వారికి ఉచితంగా రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాన్ని పొందొచ్చు. ఖాతాలో వార్షికంగా సగటున రూ. 1700 నిల్వ ఉంచాలి. నిల్వ సొమ్ముకు ఏటా 4 శాతం వడ్డీని రెండు విడతలుగా చెల్లిస్తుంది. ఉచిత డెబిట్ కార్డు, చెక్ బుక్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలూ ఉచితమే. నెలవారీ పెన్షన్కు 10 రెట్లు లేదా గరిష్ఠంగా రూ. 2 లక్షల రుణం తీసుకోవచ్చు. లాకర్ తీసుకుంటే 25 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్ లేదా ఓటర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్(గుర్తింపు కోసం), వయసు నిర్ధారణకు సంబంధించిన సర్టిఫికెట్ తో సీనియర్ సిటిజన్లు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఖాతా తెరవొచ్చు. బ్యాంకు దాకా వెళ్లలేని పరిస్థితిలో ఉంటే బ్యాంకు ప్రతినిధి వచ్చి ఖాతా తెరిపిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos