కేసుల ఉపసంహరణకు కెయిర్న్ అంగీకారం

కేసుల ఉపసంహరణకు కెయిర్న్ అంగీకారం

న్యూ ఢిల్లీ : వివిధ దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీ నానికి దాఖలు చేసిన కేసులను ఉపసంహరించు కుంటా మని బ్రిటన్లోని కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ మంగళవారం ప్రకటించింది. పూర్వాన్వయ పన్ను చట్టాన్ని రద్దు చేసినందున ఒక బిలియన్ డాలర్లు చెల్లించిన రెండు రోజుల్లోనే ఈ కేసులను ఉపసంహరించు కుంటామని వివరించింది. వ్యాపార ఆస్తులు భారత దేశంలో ఉంటూ, వాటి యాజమాన్యం విదేశాల్లోకి మారితే కేపిటల్ గెయిన్స్ విధించేలా 2012లో ప్రభుత్వం చట్టాన్ని చేసింది. దీన్ని మోదీ ప్రభు త్వం గత నెల్లో రద్దు చేసింది. పూర్వాన్వయ పన్ను కోసం జప్తు చేసిన సొమ్మును తమకు తిరిగి ఇచ్చేయ నున్నందుకు బదులుగా భారత ప్రభుత్వంపై తాము పెట్టిన కేసు లను ఉపసంహరించుకుంటామని సంస్థ చేర్మన్ సైమన్ చెప్పారు. పారిస్లోని దౌత్య కార్యాలయాల భవనాలు, అమెరికాలోని ఎయిరిండియా విమానాలను స్వాధీనానికి పెట్టి న కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకు బ్లాక్రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రముఖ షేర్ హోల్డర్స్ సమ్మతించినట్లు తెలిపారు.

తాజా సమాచారం