అప్పులు జాస్తి…. ఖర్చు ‘నాస్తి’

అప్పులు జాస్తి…. ఖర్చు ‘నాస్తి’

ప్రజావాహిని-బెంగళూరు

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు జాస్తీ చేసినా అభివృద్ది సంక్షేమ పథకాలకు వ్యయం చేయకుండా మురగబెట్టి రుణ దాతలకు వడ్డీ చెల్లిస్తోంది. 2019-20లోఇదే జరిగిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ నివేదిక నిగ్గు దేల్చింది. దీన్ని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బుధ వారం విధాన సభకు సమర్పించారు. మొత్తం రూ.24,150 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఇది అంతకు ముందు సంత్సరం కంటే 38 శాతం అధికం. దీంతో వడ్డీ చెల్లింపు మొత్తం  రెవిన్యూ రాబడిలో 9.13 శాతానికి చేరింది. ఇది పద్నాల్గో ఆర్థిక సమితి చేసిన సిఫార్సు కంటే చాలా ఎక్కువ. రుణాలు ఎక్కువగా ఉండటంతో  నగదు నిల్వ 57 శాతం అధిమైంది. బడ్జెట్‌ లో రూ.2,63,804 కోట్లు వ్యయం చేయ దలచారు. అందులో రూ.29,826 కోట్లు వ్యయం చేయకుండా మురగ బెట్టారు. ఇది అనుబంధ బడ్జెట్‌ కంటే 29.35 శాతం ఎక్కువ. ఇంకా ఆదా చేసిన మొత్తంలో 51 శాతాన్ని తిరిగి ఖజానాకు చెల్లించ లేదు. 46 శాతం నిధుల్ని వ్యయం చేయకుండా మిగల బెట్టేందుకు గల కారణాల్ని అధికార్లు వివరించ లేదు. ఎంతో గొప్పగా  ప్రచారాన్ని చేసిన క్షీరభాగ్య, ప్రోస్థెటిక్స్‌, ఆర్థోటిక్స్‌ కోర్సుల శిక్షణా కేంద్రాలు ఆరంభమై కాలేదు. ఇందుకు తగిన సన్నాహాల్ని చేయక పోవటమే ప్రధాన కారణం.  21 పనులకు అనవసరంగా రూ.340 కోట్లు అదనంగా మంజూరు చేసారు. మరో 24 పనులకు మంజూరు చేసిన నిధుల్లో రూ.10,217 కోట్లు అనవసరమని తేలింది. రెవిన్యూ మిగులు రూ.1,185 కోట్లు కాగా ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల్పోత్తిలో   2.25 శాతానికి, రుణ భారమూ 19.86 శాతానికి పరిమితమైంది. రెండూ ఆర్థిక బాధ్యతా చట్టం నియమావళికి లోబడే ఉండటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos