వారిని వెంటనే విడుదల చేయాలి

వారిని వెంటనే విడుదల చేయాలి

న్యూఢిల్లీ : బెయిల్ మంజూరై రెండు రోజులైనా విడుదలకు నోచుకుని విద్యార్థి సంఘాల కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సిఎఎను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఢిల్లీలో ఆందోళనలు చేపట్టినందుకు విద్యార్థి సంఘాల నేతలు నటాషా నర్వాల్, దేవంగణ కలిత, ఆశిఫ్ ఇక్బాల్ తన్హా లను అరెస్టు చేసారు. వారికి బెయిల్ మంజూరు అయినా జైలులోనే బంధించారు. ‘బెయిల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా తమను బంధించటం చట్టవిరుధ్ధం. మమ్మల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించండి’ అని వారు విన్నవించారు. వారి పూచీకత్తులు, చిరునామాల ధ్రువీకరణ కోసం వారి విడుదలకు కొంత సమయం కావాలని బుధవారం పోలీసులు విచారణ న్యాయస్థానానికి పోలీసులు విన్నవించారు. మధ్యాహ్నంలోగా పని పూర్తిచేయాలని గడువునివ్వగా విఫల మవ్వడంతో కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు.ఉద్దేశపూర్వకంగానే పోలీసులు విడుదలలో జాప్యం చేస్తున్నారని వారి తరపు న్యాయవాది ఆరోపించారు. ఆధార్ నంబర్ వెరిఫికేషన్లో జాప్యమని చెప్పడంపై మండిపడ్డ కోర్టు అసలు ఇతర కేసుల్లో కూడా ఇటువంటి విధానాన్నే అవలంభిస్తున్నారాని ప్రశ్నించింది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos