అమిత్ షా స‌వాల్‌కు సిద్ధ‌మ‌న్నభూపేష్ బ‌ఘేల్

అమిత్ షా స‌వాల్‌కు  సిద్ధ‌మ‌న్నభూపేష్ బ‌ఘేల్

రాయ్పూర్ : చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతుండగా ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్కు భూపేష్ బఘేల్ అంగీకరించారు. గత ఐదేండ్లుగా తాను చేసిన అభివృద్ధి, 15 ఏండ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని సీఎం ప్రకటించారు. 15 ఏండ్లుగా మీ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలు, ఐదేండ్లలో తాము చేసిన పనులపై చర్చ జరగాలని భూపేష్ బఘేల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నల్ల రంగు సోఫాపై ఇరువైపులా అమిత్ షా, భూపేష్ బఘేల్ పేర్లున్న ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. చర్చా వేదిక, సమయం, ప్రదేశం గురించి మీరు ఇంకా వెల్లడించలేదని, అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే వేదికను సిద్ధం చేశారని రాసుకొచ్చారు. కాగా చత్తీస్ఘఢ్లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో అమిత్షా ప్రసంగిస్తూ మోదీ 15 ఏండ్ల హయాంలో జరిగిన అభివృద్ధి, చత్తీస్ఘఢ్లో భూపేష్ బఘేల్ హయాంలో ఐదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక చత్తీస్ఘఢ్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో ఈనెల 17న మలివిడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos