న్యూ ఢిల్లీ:జస్‌ప్రీత్ బుమ్రాను మిస్ కావడం భారత్‌కు తీవ్ర లోటేనని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో మార్పులు జరిగిన సంగతి విదితమే. గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా ఆట నుండి తొలగిపోయారు. బుమ్రాకు బదులు యువ పేసర్ హర్షిత్ రాణాకు మ్యాచ్‌లో అవకాశం దక్కింది. తొలిసారి ఎడమ చేతివాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంది. టీ20ల్లో భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నేతృత్వంలో పేస్ విభాగం బరిలోకి దిగనుంది. అయితే, ఐదుగురు స్పిన్నర్లను టీమిండియా తీసుకోవడం గమనార్హం. ఈక్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” జస్‌ప్రీత్ బుమ్రాను మిస్ కావడం భారత్‌కు తీవ్ర లోటే. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రా ఈసారి ఆడటం లేదు. షమీతో కలిసి యువ బౌలర్ అర్ష్‌దీప్ కొత్త బంతిని పంచుకొనే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ టీ20 స్పెషలిస్ట్. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ పొట్టి ఫార్మాట్ కాదు. పది ఓవర్లు వేయాల్సి ఉంది. అందుకే, అతడికి మరింత మ్యాచ్ ప్రాక్టీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే నాలుగు ఓవర్లకు 10 ఓవర్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది” అని లాయిడ్ వెల్లడించారు. ”అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అత్యుత్తమ జట్టునే ఎంపిక చేసింది. తప్పకుండా విజేతగా నిలుస్తామని నమ్ముతున్నా. బెంచ్ కూడా చాలా బలంగా ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద సమస్య కాదని భావిస్తున్నా. జట్టు కూర్పు చాలా బాగుంది. జట్టులోని ప్రతిఒక్కరూ పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. విరాట్, రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇంగ్లండ్‌పై ఎలా విజయం సాధించామో మీరే చూశారు. దుబాయ్ లోనూ భారత్‌లో ఉన్నట్లే పిచ్ పరిస్థితులు ఉంటాయి” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.