తుపాకి తూటల న్యాయం వద్దు

తుపాకి తూటల న్యాయం వద్దు

న్యూ ఢిల్లీ: హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల చర్యను వేలాది మంది ప్రశంసించారు. కొందరు ప్రముఖులు తప్పుబట్టారు. వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 10 రోజులకు వారి ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యాచారం తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఎదురు కాల్పుల వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయి. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలుసు. కానీ, దానికి ఇది పద్ధతి కాదుద’ని కార్తి చిదంబరం వ్యాఖ్యా నించారు. సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ కూడా స్పందించారు. “తుపాకి తూటల న్యాయం అవసరం లేదు. ఇది కచ్చితంగా హర్షించ తగ్గ పరిణామం కాదు. మహిళలు, వారి రక్షణ పేరు చెప్పి ఇలా ఎదుకు కాల్పులు చేయడం సమంజసం కాదు. ప్రతి ఎదురు కాల్పులపైనా ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేయాలి. విచారణ తప్పనిసరిగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎదురు కాల్పులపై స్వతంత్ర సమితి విచారణ జరపాలి ’అని డిమాండు చేసారు. వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఎదురు కా్పలు పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షించారు. సామాజిక మాధ్య మాల్లో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos