బెంగళూరుకు ప్రకృతి వరం బగుల్ రాక్ ఉద్యానవనం..

  • In Tourism
  • December 23, 2019
  • 275 Views
బెంగళూరుకు ప్రకృతి వరం బగుల్ రాక్ ఉద్యానవనం..

 ఉద్యాననగరిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బెంగళూరు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలంటే కబ్బన్‌పార్క్‌, లాల్‌బాగ్‌,బెంగళూరు ప్యాలెస్‌, విధానసౌధ,బన్నేరుఘట్ట,ఇస్కాన్‌ టెంపుల్‌,టిప్పుసుల్తాన్‌ సమ్మర్‌ప్యాలెస్‌ తదితర ప్రదేశాలు గురించి మాత్రమే చెబుతుంటారు.కానీ బెంగళూరు నగరంలోని బసవనగుడి ప్రాంతంలో ఉన్న బగుల్‌ రాక్‌ పార్క్‌కు కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశంలో ఒకటని చెప్పుకొని తీరాల్సిందే.భూమిపై వెలసిన అత్యంత పురాతన రాక్‌ పార్కుల్లో బగుల్‌రాక్‌ పార్క్‌ ఒకటనే విషయం చాలా మందికి తెలియదు.

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

సుమారు మూడువేల మిలియన్‌ ఏళ్ల కిందట ద్వీపంగా ఉన్న ఈ ప్రాంతంలో గ్నీస్‌ అనే స్పటికపు రాళ్లతో సమూహంగా ఏర్పడిన పార్కు నేడు బగుల్‌పార్కుగా రూపాంతరం చెందింది.బెంగళూరు నగర నిర్మాణానికి ఆద్యుడైన కెంపేగౌడ 1585లో బెంగళూరు నగర నిర్మాణంలో భాగంగా సరిహద్దుల్లో గుర్తించే క్రమంలో దక్షిణవైపు సరిహద్దుగా రాక్‌పార్కును ఎంచుకొని అందులో స్తంబం నాటాడని స్థానిక చరిత్రద్వారా తెలుస్తోంది.శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి రాక్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన స్తంబాన్ని దివిటీగా వినియోగించేవారని తెలుస్తోంది.రాక్‌పార్కులోని చాలా శాతం రాళ్లు కొద్దిపాటి గుంతలు కలిగి ఉంటాయి.అప్పట్లో వీటిని సరిహద్దు దీపాలుగా వినియోగించేవారని స్థానిక చరిత్రద్వారా తెలుస్తోంది.

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

సుమారు 16 ఎకరాల్లో విస్తరించి ఉన్న బగుల్‌పార్కును ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఉద్యానవనశాఖ,అక్కడి నగర పాలక మండలి పలు చర్యలు తీసుకుంది.సహజ రాతి నిర్మాణాల మధ్య చిన్నపాటి జలపాతాలు,నీటి ప్రవాహాలు ఎటు చూసినా పచ్చటి చెట్లపొదలు,పొడువాటి వెదురు చెట్ల సమూహాలతో బగుల్‌పార్క్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకంగా కూడా విరాజిల్లుతోంది.పార్కులో ఉద్యానవనశాఖ అభివృద్ధి చెసిన వరుస క్రమంలో దర్శనమిచ్చే దట్టమైన చెట్ల సమూహం పాదచారులకు స్వర్గధామంగా(వాకర్స్‌ ప్యారడైస్‌)గా ప్రసిద్ధి చెందింది.ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం నడక వ్యాయామం కోసం సుమారు వెయ్యిమంది వస్తుంటారంటే ఎంతటి ఆహ్లాదాన్ని పంచుతుందో అర్థం చేసుకోవచ్చు.

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

బగుల్‌పార్క్‌ లోపల దృశ్యాలు..

పార్కుకు వచ్చే నగరవాసులు,పర్యాటకుల కోసం పార్కులో ఏర్పాటు చేసిన 300 మంది కూర్చోగలిగే యాంపీ థియేటర్‌ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.కర్ణాటక రాష్ట్రం చరిత్రపుటల్లోకెక్కిన రాజులు,చక్రవర్తులు,మేధావులు,శాస్త్రవేత్తలు,సాహితీవేత్తలు తదితర గొప్పవ్యక్తుల గురించి ప్రజలకు,పర్యాటకులకు ముఖ్యంగా పిల్లలకు అవగాహన కల్పించడానికి పార్కులోని పాత వాటర్‌ ట్యాంకు గోడలపై ఏర్పాటు చేసిన కుడ్యచిత్రాలు ఆకట్టుకుంటాయి.ఇక బగుల్‌పార్కు కేవలం పర్యావరణ ప్రేమికులకు,పర్యాటకులకు మాత్రమే కాదు కొన్ని జాతుల  గబ్బిలాలకు సైతం స్వర్గధామంగా నిలుస్తోంది.

యాంపీ థియేటర్‌..

పాతట్యాంకు గోడపై కుడ్యచిత్రాలు..

ఫ్రూట్‌ బ్యాట్స్‌(స్టెరోపస్‌ గిగాంటెయస్‌)అనే జాతికి చెందిన గబ్బిలాలకు బగుల్‌ పార్కు నిలయంగా ఉంది.వీటితో పాటు మామిడి,పనస తదితర అనేక జాతుల పండ్లచెట్లకు కూడా బగుల్‌ రాక్‌పార్కు నిలయంగా విరాజిల్లుతోంది.ఇక బగుల్‌పార్కు పక్కనే ఉన్న బసవనగుడి లేదా బుల్‌ టెంపుల్‌ కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి.ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం ఆలయంలోని నంది కింద ప్రవహించే వృషభానది తీరాన బుల్‌ టెంపుల్‌ లేదా బసవనగుడిని నిర్మించినట్లు తెలుస్తోంది.ఇక్కడే ఉన్న గణపతి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినదే..

చెట్లకు వేలాడుతున్న ఫ్రూట్ బ్యాట్స్..

ఎలా చేరుకోవాలి..
రోడ్డులేదా రైలు మార్గంలో నేరుగా బెంగళూరు నగరానికి చేరుకొని అక్కడి నుంచి బీఎంటీసీ సిటీ బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో బగుల్‌పార్కు చేరుకోవచ్చు.విమానమార్గంలో అయితే దేవనహళ్లి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బెంగళూరులోని బగుల్‌ పార్కుకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos