పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు

న్యూ ఢిల్లీ:బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ … దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్‌, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ రిట్‌ పిటిషన్‌ వేశారు. మరోవైపు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ … ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కే.వినోద్‌ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఈ నెల 4న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అయితే ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం అందులో స్పష్టం చేయలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos