తలస్సేరి క్రికెట్ స్టేడియంకు బ్రెట్ లీ బహుమతి

తలస్సేరి క్రికెట్ స్టేడియంకు బ్రెట్ లీ బహుమతి

తిరువనంతపురం : కేరళలోని తలస్సేరి క్రికెట్ స్టేడియం కోసం తన వేగంతో ఆశ్చర్యపరిచిన ఆస్ట్రేలియా ప్రముఖ బౌలర్ బ్రెట్ లీ సంతకం చేసిన క్రికెట్ బాల్, బ్యాట్ ను బహుమతిగా ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్ళిన కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షంసీర్ కు బ్రెట్ లీ తలస్సేరి క్రికెట్ స్టేడియం కోసం ఈ  బహుమతిని అందించారు.  భారతదేశంలోనే కేక్‌లు, సర్కస్‌లు పుట్టిన తొలి వారసత్వ నగరమైన తలస్సేరిలో క్రికెట్ కూడా ప్రారంభమైన విషయాన్ని ప్రస్తావించగా స్పీకర్ ఏఎన్ షంసీర్ తలస్సేరిపై తనకు మంచి అవగాహన ఉందని బ్రెట్ లీ పేర్కొన్నారని తెలిపారు. భవిష్యత్తులో తలస్సేరి క్రికెట్ స్టేడియం కోసం పెవిలియన్ సిద్ధం చేయాలని, అక్కడ బ్రెట్ లీ బహుమతిగా ఇచ్చిన బ్యాట్, బాల్ లను రెండు దేశాల మధ్య పరస్పర ప్రేమకు చిహ్నంగా ప్రదర్శించబడాలని బ్రెట్ లీ తన కోరికను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ అర్జున్ ఎస్ కుమార్ కూడా స్పీకర్ వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos