ఆ ఫ్లాట్లు ‘బ్రాహ్మణుల’కే

ఆ ఫ్లాట్లు ‘బ్రాహ్మణుల’కే

తిరుచిరాపల్లి: ఇక్కడి ఒక బిల్డర్ బ్రాహ్మణులకు మాత్రమే ఫ్లాట్లమ్ముతామని పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై విమర్శలు వెల్లువె త్తాయి. ఇక్కడకు సమీపంలోని శ్రీరంగం-మేలూరు రోడ్డులో శ్రీ శక్తి రంగ అపార్టుమెంట్ ను ఓం శక్తి కన్స్ట్రక్షన్ కొత్తగా నిర్మించింది. ఇక్కడి ఫ్లాట్లను బ్రాహ్మణులకు మాత్ర మే విక్రయిస్తామని బిల్డరు ప్రకటించారు. ఇది అంటరానితనానికి నిదర్శనమైనందున ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు అస్పృ స్యతా నివారణ ఫ్రంట్ (టీఎన్యూఈఎఫ్) జిల్లా కలెక్టరు శివరాజుకు ఫిర్యాదు చేశారు. ఇది దళితులు, ముస్లిములకు ఫ్లాట్లు ఇవ్వకుండా నిరోధించట మేనని తమిళనాడు అస్పృశ్యతా నివారణ ఫ్రంట్ జిల్లా కార్యదర్శి వినోద్ మణి విమర్శించారు. కులమతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మిస్తున్న నేటి తరుణంలో బిల్డరు ఇచ్చిన ప్రకటన కులమతాలను ఊటంకించడం తప్పన్నారు. ఒక కులానికి నిర్మించిన అపార్టుమెంటుకు ఎలా అనుమతిం చారని తిరుచిరాపల్లి మున్సిపల్ చీఫ్ ఇంజినీరునూ మణి ప్రశ్నించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద బిల్డరుపై శ్రీరంగం పోలీసులకు ఫిర్యాదు చేసామని తెలిపారు. ‘మా అపార్టుమెంటులో ఫ్లాట్లను శాకాహారులకే విక్రయించాలని నిర్ణయించాం. ప్రకటనలో పొరపాటున బ్రాహ్మణులకు మాత్రమే నని పడింద’ని ఓంశక్తి కన్ స్ట్రక్షన్ ప్రతినిధి జీఎం అన్బు సంజాయిషీ ఇచ్చారు. కులాల పట్టింపు లేకుండా శాఖాహారులందరికీ ఫ్లాట్లు విక్రయిస్తామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos