అన్నదాతలది ‘నాటక ’ఆందోళన

అన్నదాతలది ‘నాటక ’ఆందోళన

 

ప్రజా వాహిని-బెంగళూరు

దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళన ప్రాయోజితమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సోమవారం విధానసభలో చేసిన వ్యాఖ్య వాగ్వాదానికి దారి తీసింది. పెరిగిన ధరల గురించి జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. వివిధ పంటలకు ప్రస్తుతం లభిస్తున్న కనీస మద్దతు ధర వివరిస్తూ రైతాంగం ఆందోళన నకిలీదని ఆరోపించారు. ఆందోళనకు  వ్యసాయ మార్కెటింగ్‌ యార్డులు, కనీస మద్ధతు ధర వల్ల లబ్ధి పొందే శక్తులు ఊతమిస్తున్నాయని కాంగ్రెస్‌ సభ్యుడు రమేశ్‌  కుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.  రమేశ్‌ కుమార్‌ ప్రశ్నించినపుడు పాలక పక్ష సభ్యులు కొందరు బిగ్గర ధ్వనితో ఆక్షేపించారు. దీనికి రమేశ్‌ కుమార్‌  తీవ్రంగా స్పందించారు. ‘వాజపేయి, అద్వానీ, మురళి మనోహర జోషి ఉన్న భాజపాకూ, ప్రస్తుత భాజపాకూ ఇదే తేడా..’ని వ్యాఖ్యానించారు. అన్నదాతలది నకలీ ఆందోళన అని బొమ్మై పదే పదే పేర్కొనటాన్ని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేసారు. అయితే బొమ్మై తన వాదనల్ని గట్టిగా సమర్థించకున్నారు. ‘అత్యాయక పరిస్థితి ముందు జరిగిన అనే ఆందోళనల్లో విదేశీ శక్తుల హస్తముందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేయలేదాని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు మన దేశంలో విదేశీ శక్తుల ఏజెంట్లు ఎక్కడ పడితే అక్కడనున్నారని వ్యాఖ్యానించారు. చమురు ధరల పెంపు,  కేంద్రం చేపట్టిన ప్రభుత్వ ఆస్తుల ప్రయివేటీకరణ, అబ్కారీ సుంకం పెంపు తదతరాల్ని సమర్థించారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలోనే అవి ప్రారంభమయ్యాయని గణాంకాలు, ఇతర అంశాలతో వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos