వ్యవస్థపై కోపంతోనే విమానాశ్రయంలో బాంబు పెట్టా..

వ్యవస్థపై కోపంతోనే విమానాశ్రయంలో బాంబు పెట్టా..

మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఘటనకు సంబంధించి పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు ఆదిత్యరావు విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. సమాజంలో వ్యవస్థ సక్రమంగా లేదని, వ్యవస్థను బాగు చేయాలన్న ఉద్దేశంతోనే తాను విమానాశ్రయంలో బాంబు పెట్టానని మంగళూరు నిందితుడు వెల్లడించాడు.’నా వద్ద డబ్బు లేదు. ఎవరూ నన్ను గుర్తించి గౌరవించం లేదు. సమాజంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. అందుకే తీవ్ర అసంతృప్తి కలిగింది. వ్యవస్థపై ప్రతీకారంతోనే విమానాశ్రయంలో బాంబు పెట్టాలనుకున్నాను. తీరా పెట్టాక తప్పుచేశానని అనిపించింది. అందుకే బెంగళూరు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయానుఅంటూ వివరణ ఇచ్చాడు.బాంబు పెట్టిన అనంతరం ఆదిత్యరావు రాత్రి ఆర్టీసీ బస్సులో బెంగళూరు చేరుకున్నాడు. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఆదిత్యరావును తీసుకుని తిరిగి మంగళూరు వచ్చిన పోలీసులు తెల్లవారు జాము వరకు అతన్ని విచారించారు. సందర్భంగా మంగళూరు నగర పోలీసు కమిషర్ డాక్టర్ హర్ష మాట్లాడుతూ బాంబు కేసును తీవ్రంగానే పరిగణిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అన్నారు. పేలుడు పదార్థాలు స్థాయివో విచారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. కాగా, నిందితుడు ఆదిత్యరావును పోలీసులు నిన్న కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి పది రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos