పెరిగిన బిఎస్‌ఎన్‌ఎల్‌ చందాదార్ల సంఖ్య

పెరిగిన బిఎస్‌ఎన్‌ఎల్‌ చందాదార్ల సంఖ్య

న్యూఢిల్లీ:జియో వినియోగదారుల సంఖ్య భారీగా క్షీణించిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-ట్రాయ్ వెల్లడించింది. నవంబరులో 5.60 లక్షల కొత్త చందారులు చేరారు.డిసెంబర్లో వారి సంఖ్య 82,308. ఇది బీఎస్ఎన్ఎల్ కంటే తక్కువ. ట్రాయ్గ త డిసెంబర్ వరకూ టెలికాం కంపెనీల చందాదారుల గణాంకాల్ని బుధవారం ఇక్కడ విడుదల చేసింది.జియో ఛార్జీల పెంపు చందాదార్ల సంఖ్య తగ్గేందుకు కారణ మని తెలిపింది.విపణిలో సంస్థ వాటా పెరిగింది. నవంబర్ తో పోలిస్తే 32.04 నుంచి 32.14 శాతానికి చేరింది. వోడాఫోన్-ఐడియా వాటా 29.12 నుంచి 28.89 శాతానికి తగ్గింది.బీఎస్ఎన్ఎల్ దాదాపు 4,26,958 మంది కొత్త చందాదారులను చేర్చుకుంది. వాటా 10.19 నుంచి 10.26 శాతానికి అధికమైంది. వొడాఫోన్-ఐడియా డిసెంబర్లో 36,44,453 మంది సభ్యులను కోల్పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos