2022లోనే జమిలి ఎన్నికలు ?

2022లోనే జమిలి ఎన్నికలు ?

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీకి గడ్డుకాలం మొదలైంది.అమెరికాతో స్నేహం కోసం పాకులాడుతూ రష్యా,ఇరాన్ తదితర మిత్ర దేశాలను దూరం చేసుకొని వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ కరోనా నియంత్రణలో విఫలం కావడం,చైనా దాడులను దాచి ఉంచడం,చైనా దాడి చేసిన అందుకు తగిన విధంగా బదులు ఇవ్వకపోవడంతో బీజేపీపై దేశంలో అసహనం తారా స్థాయికి చేరుకుంది.ఈ పరిస్థితుల్లో 2022 లోనే జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.ఇన్ని వైఫల్యాలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి,సఖ్యత లేకపోవడంతో ఇదే అదునుగా భావించి జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోంది.రాష్ట్రాలకు అభివృద్ధి నిధులు ఇవ్వకుండా జమిలి ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తెచ్చుకొని.. దేశం మొత్తం బీజేపీనే ఉండేలా చేయడం లాంటి ప్లాన్లు ఎన్నో చేయబోతున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.అయితే మోడీ మీద ముందున్న సానుభూతి అంతా ఇప్పుడు ప్రజల్లో లేదని తెలుస్తోంది.. కరోనా టైంలో అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయకుండా 21 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు చెప్పారని.. ఎవరికి ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదని.. సాయం చేయలేదని అపవాదు ఉంది. ఇప్పటికే దేశ జీడీపీ పూర్తిస్థాయిలో పడిపోయింది. చైనా దేశం భారత్ పై దండెత్తి లోపలికి వచ్చినా బయటకు చెప్పలేదని మోడీపై విమర్శలున్నాయి.ఇక రాష్ట్రాలతో సఖ్యత లేకుండా కేంద్రంలోని బీజేపీ వాళ్ల పెత్తనం ఎక్కువ అయ్యింది. ఇలాంటివి అన్నింటిపై ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లి బాగానే ప్రచారం చేశాయని కొన్ని వర్గాలంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి అధికారంలో ఉంటే బీజేపీ మీద నమ్మకం సన్నగిల్లుతుందని.. అందుకే బీజేపీ జమిలీ ఎన్నికలకు ముందుగానే వెళ్తోందని ప్రచారం సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos