జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది. ఎన్సీ 43, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కమలం పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా.. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఓటమి దాదాపు ఖరారైంది. 9 రౌండ్లు పూర్తి అయ్యే వరకు ఎన్సీ అభ్యర్థి సురిందర్ కుమార్ లీడింగ్‌లో ఉన్నారు. ఆయన 2797 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనున్నది. అయితే సురిందర్‌కు ఇప్పటికే 33180 ఓట్లు పోలయ్యాయి. ఇక రవీందర్‌కు 24429 ఓట్లు పోలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 8751 ఓట్ల ఆధిక్యంలో ఎన్సీ నేత సురిందర్ కొనసాగుతున్నారు.