నీతీశ్​ దెబ్బకు భాజపాకు కష్టాలు

నీతీశ్​ దెబ్బకు భాజపాకు కష్టాలు

న్యూ ఢిల్లీ: జేడీయూ భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకోవటంతో రాజ్యసభలో ఎన్డీఏకు ఎదురుదెబ్బ తగలనుంది. ఏదైనా ముసాయిదా నెగ్గాలంటే తటస్థ పక్షాల మద్దతు అనివార్యం. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్పర్సన్ సహా జేడీయూకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. జేడీయూ, ఎన్డీఏ కూటమిలో ఉన్నపుడూ పెద్దల సభలో పూర్తి మెజార్టీ లేదు. గత మూడేళ్లలో శివసేన, శిరోమణి అకాలీదళ్ కూటమిని వీడాయి. 2019లో తెలుగుదేశం పార్టీ వైదొలిగింది. తాజాగా నీతీశ్కుమార్ సారథ్యంలోని జేడీయూ కూడా కూటమిని వీడటంతో అధికారపక్షానికి గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి. పెద్దల సభలో కీలక ముసాయిదాలు నెగ్గాలంటే బీజేడీ, వైకాపా మద్దతు తప్పని సరి కానుంది. రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ముసాయిదాలు, ఇతర ప్రతిపాదనలు ఆమోదం పొందటానికి 119 మంది మద్ధతు అవసరం. జేడీయూ తో ఉన్నపుడు ఎన్డీఏకు ఐదుగురు నామినేటెడ్, ఒక స్వతంత్రుడు కలిపి మొత్తం 115మంది సభ్యుల బలం ఉండేది. జేడీయూ వైదొలిగిన తర్వాత ఎన్డీఏ బలం 110కి పడిపోయింది. శీతాకాలం పార్లమెంటు సమావేశాల నాటికి ముగ్గురు సభ్యులను నామినేట్ చేసేందుకు అవకాశం ఉంది. త్రిపురలో ఎన్నిక జరిగితే ఆ ఒక్క స్థానం కూడా భారతీయ జనతా పార్టీ నెగ్గే సూచనలు ఉన్నాయి. అప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ బలం 114కు పెరుగుతుంది. అప్పుడు ముసాయిదాల ఆమోదానికి 122 మంది మద్ధతు అవసరం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos