.బీజేపీకి స‌పోర్టు ఇచ్చేది లేదు

.బీజేపీకి స‌పోర్టు ఇచ్చేది లేదు

భువనేశ్వర్: తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో సోమ వారం బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సమావేశం నిర్వహించారు. జూన్ 27 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. బలమైన,చురుకైన ప్రతి పక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలన్నారు. నవీన్ పట్నాయక్తో జరిగిన సమావేశం గురించి రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మీడియాకు వివరించారు. ఈ సారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాత్రమే మాట్లాడరని, ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే, అప్పుడు బీజేపీ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామన్నారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను లేవనెత్తనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని బీజేడీ ఎంపీ తెలిపారు. బొగ్గు రాయాల్టీని కూడా గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని అన్నారు. తాజాగా ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos